ETV Bharat / international

Afghanistan women: 'మహిళలను మనుషుల్లానే చూడట్లేదు!'

అఫ్గానిస్థాన్​లో(Afghanistan news) భయంకర పరిస్థితులు ఉన్నాయని, మహిళలను(Afghanistan women) తాలిబన్లు కనీసం మనుషుల్లానైనా భావించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశానికి చెందిన పలువురు మహిళా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు. దిల్లీలో భారతీయ మహిళా ప్రెస్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అఫ్గాన్​ పరిస్థితులను(Afghanistan women) వివరిస్తూ ఆవేదన చెందారు.

Afghan women
అఫ్గానిస్థాన్​లో మహిళలపై దాడులు
author img

By

Published : Sep 16, 2021, 2:45 PM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు (Afghanistan Taliban).. తొలి రోజు నుంచే మహిళా హక్కులను(Afghanistan women) కాలరాస్తున్నారు. మొదటి నుంచి భయపడినట్లుగానే రెండు దశాబ్దాల నాటి చీకటి రోజులను గుర్తు చేస్తున్నారు. మహిళలపై కఠిన ఆంక్షలు(Afghanistan women) విధిస్తున్నారు. అఫ్గాన్​ నుంచి బయటపడిన మహిళలు.. అక్కడి పరిస్థితులను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 'తాలిబన్లు మహిళలను కనీసం మనుషుల్లానే భావించటం లేదు' అని అఫ్గాన్​కు చెందిన పరిశోధకురాలు, హక్కుల కార్యకర్త హుమెరా రిజాయ్​ ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్​ నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిలో తానూ ఒక్కరినని చెప్పారు.

" గతంలో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు మహిళలపై దాడులు, హత్యలు చేశారు. మహిళల హక్కులను కాలరాశారు. 2000 సంవత్సరం నుంచి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో శ్రమపడ్డారు. ఇప్పుడు ఆ శ్రమంతా వృథా అయ్యింది"

- హుమెరా రిజాయ్​, హక్కుల కార్యకర్త.

దిల్లీలో భారతీయ మహిళా ప్రెస్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జర్నలిస్టుల(Afghanistan women) సమావేశంలో.. అఫ్గాన్​లోని పరిస్థితులను(Afghanistan crisis) వివరించారు ఆ దేశ పార్లమెంట్​ సభ్యురాలు షింకాయ్​ కరోఖైల్​.

"అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. దేశంలో చాలా మంది మహిళా కార్యకర్తలు, రాజకీయ నేతలు చిక్కుకుపోయారు. తాలిబన్లు వాళ్ల ఇళ్లకు వెళ్లి భయపెడుతున్నారు. వారి భద్రతా సిబ్బంది ఆయుధాలు లాక్కుంటున్నారు. వాళ్ల వద్ద ఉన్న కార్లను సైతం తీసుకెళ్తున్నారు. మహిళలు పారిపోయేలా చేయటం లేదా గొంతు ఎత్తకుండా చేసేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. "

- షింకాయ్​ కరోఖైల్​, అఫ్గాన్​ పార్లమెంట్​ సభ్యురాలు.

జంతువులుగా..

మహిళలను జంతువులుగా భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అఫ్గాన్​ జర్నలిస్ట్​ ఫాతిమా ఫరమార్జ్​. వారికి నచ్చిన విధంగా మహిళల పట్ల ప్రవర్తించాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. ఇటీవల కాబుల్​లో జరిగిన ఆందోళనలను లైవ్​ కవరేజీకి వెళ్లిన తన తోటి ఉద్యోగులను తాలిబన్లు క్రూరంగా చితకబాదిన ఘటనను గుర్తు చేస్కున్నారు ఫాతిమా. అఫ్గాన్​ మహిళల భవిష్యత్తు.. తాలిబన్ల పాలనలో నలిగిపోతుందని చెప్పారు.

ఇదీ చూడండి: Taliban news: 'మహిళలు పిల్లల్ని కనాలి కానీ.. పదవులు అడగకూడదు'!

Afghanistan News: 'నా దుస్తులు తాకొద్దు'.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.