ETV Bharat / international

టీవీ, సినిమా, స్కూల్ బంద్- మహిళలకు మళ్లీ ఆ రూల్స్ తప్పవా?

author img

By

Published : Aug 14, 2021, 6:21 PM IST

Updated : Aug 14, 2021, 7:42 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా, నాటో దళాలు వెనుదిరుగుతున్న క్రమంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల భూభాగం వారి చేతిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమ స్వేచ్ఛ, భద్రతపై ఆందోళన చెందుతున్నారు అక్కడి మహిళలు. వారి చేతిలోకి అధికారం వెళితే.. గతంలా చీకటి రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారు.

Taliban
నగరాలను చుట్టుముడుతోన్న తాలిబన్లు
తాలిబన్ల గుప్పిట్లోకి అఫ్గానిస్థాన్​

అఫ్గానిస్థాన్​లో ఇప్పటికే మూడింట రెండొంతుల భూభాగం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వేగంగా దూసుకెళ్తూ రోజుకో ప్రాంతాన్ని తమ వశం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మహిళలు తమ భద్రత, హక్కుల విషయమై ఆందోళనకు గురవుతున్నారు. దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళితే.. మునుపటి చీకటి రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే భయంతో బిక్కు బిక్కు ముంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.

Taliban
హెరత్​ నగరంలో తమ జెండా ఎగురవేస్తున్న తాలిబన్లు

తాలిబన్లు అధికారం చేపడితే.. మానవ హక్కులను అణచివేసి, తమను ఇళ్లకే పరిమితం చేస్తారనే భయం అక్కడి మహిళల్లో ఎక్కువగా ఉంది. టీవీ, సినిమాలు చూడటం, సంగీతం వినడాన్ని తాలిబన్లు ఒప్పుకోరు. 10 సంవత్సరాలు నిండిన పిల్లలను పాఠశాలకు వెళ్లడాన్ని కూడా ఆమోదించరు. ఈ క్రమంలో తమ స్వేచ్ఛకు, రక్షణకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి మహిళలు.

తాలిబన్లు కఠిన నిబంధనలు విధిస్తారని, మహిళల హక్కులను కాలరాస్తారనే కారణంగా ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 2,50,000 మంది అఫ్గాన్​ వాసులు పొరుగు దేశాలకు పారిపోయారని అమెరికా శరణార్థుల సంస్థ తెలిపింది. అందులో 80 శాతం మంది మహిళలు, చిన్నారులే కావటం గమనార్హం.

Taliban
కాబుల్​లోని శిబిరంలో శరణార్థులు
Taliban
శిబరంలో ఏర్పాటు చేసిన టెంట్లు

తాలిబన్ల అరాచకాలకు భయపడి పారిపోతున్న వారి కోసం దేశ రాజధాని కాబుల్​లోని ఓ ప్రధాన పార్కులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3000 మంది వరకు ఈ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

" పురుషుడి తోడు లేకుండాఎవరినీ మార్కెట్​కు వెళ్లేందుకు అనుమతించటం లేదు. మగవారి తోడు ఉన్నవారి సంగతి సరే. కానీ మగవారు లేని వారి పరిస్థితి ఏమిటి? వారి రోజువారీ జీవితాన్ని ఎలా వెళ్లదీస్తారు? చాలా మంది మహిళలు 20-25 ఏళ్ల వయసులోనే భర్తలను కోల్పోయారు. వారి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. వారు ఎలా బతుకుతారు? "

- నీలోఫర్​, పాఠశాల ఉపాధ్యాయురాలు.

తాలిబన్​ దళాలు ప్రతిరోజూ కొత్త నగరాలను ఆక్రమిస్తున్న క్రమంలో మహిళల్లో భయం ఎక్కువవుతోందని పేర్కొన్నారు మహిళా హక్కుల కార్యకర్త జార్మినా కాకర్​. తాలిబన్ల చేతిలోకి అధికారం వెళితే రెండు దశాబ్దాల క్రితం నాటి చీకటి రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

" మనం కూడా గూడు నిర్మించుకుని అందులో జీవితాంతం ప్రశాంతంగా ఉండే పక్షుల మాదిరిగానే ఉండాలని భావిస్తున్నా. కానీ, ఆకస్మికంగా ఆ గూడును కొందరు పాడు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. నాకు చాలా బాధగా ఉంది. గతంలో తాలిబన్ల పాలన కాలంలో నా తల్లి నాకు ఐస్​ క్రీమ్​ కొనిచ్చేందుకు బయటకు తీసుకెళ్లింది. కొన్ని క్షణాల పాటు ఆమె ముఖం కనిపించినందుకే కొట్టిన సంఘటన నాకు గుర్తుంది. ఆనాటి నిస్సహాయ పరిస్థితులను ఎన్నటికీ మర్చిపోలేను. మళ్లీ తాలిబన్లు అధికారంలోకి వస్తే నాటి చీకటి రోజులకు వెళ్లిపోతామనే భయం వేస్తోంది. "

- జార్మినా కాకర్​, మహిళా హక్కుల కార్యకర్త.

2001 కన్నా ముందు అమెరికా జోక్యం చేసుకునే వరకు.. అఫ్గాన్​ను పాలించారు తాలిబన్లు. ఆ సమయంలో బాలికల విద్య, మహిళలు పని చేయటం వంటి వాటిపై నిషేధం విధించారు. పురుషులు లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లటానికి కూడా నిరాకరించారు. బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేయటం, దొంగల చేతులు నరకటం, అక్రమ సంబంధాల ఆరోపణలు ఎదుర్కొన్న మహిళలపై రాళ్ల దాడి వంటివి చేశారు. అయితే.. ప్రస్తుతం వారు ఆక్రమించుకున్న ప్రాంతాల్లో అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు ఎలాంటి సమాచారం లేదు. కానీ, కొన్ని ప్రాంతాల్లో తాలిబన్​ దళాలు ఇళ్లను స్వాధీనం చేసుకోవటం, కొన్నింటిని ధ్వంసం చేయటం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: తాలిబన్ల ఉక్కుపిడికిట్లో అఫ్గాన్‌- రష్యా, చైనా మద్దతు!

తాలిబన్ల అధీనంలోకి మూడు రాష్ట్రాలు, ఆర్మీ స్థావరం

Last Updated : Aug 14, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.