ETV Bharat / international

తాలిబన్లతో 18 గంటల పాటు​ పోలీసు ఒంటరి పోరాటం

తాలిబన్ల దుశ్చర్యలకు భయపడి కొందరు సైనికులు పక్క దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న భయానక పరిస్థితులు అఫ్గానిస్థాన్​లో నెలకొన్నాయి. ఈ తరుణంలో ఓ పోలీసు వీరోచిత పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. తమపై దాడి చేసిన తాలిబన్లతో ఏకంగా 18 గంటల పాటు ఒంటరిగా పోరాటం చేశాడు ఆ వీరుడు.

Afghan police
తాలిబన్లతో వీరోచిత పోరాటం
author img

By

Published : Jul 15, 2021, 5:39 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశంలోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కాందహార్​లో తనిఖీలు నిర్వహిస్తున్న ఓ పోలీసు బృందంపై దాడి చేశారు తాలిబన్లు. వారితో ఓ పోలీసు 18 గంటల పాటు ఒంటరి పోరాటం చేశాడు. నగరంలోకి ముష్కరులు చొరబడకుండా అడ్డుకున్నాడు.

ఇదీ జరిగింది..

కాందహార్​లోని తనిఖీ కేంద్రం వద్ద అహ్మద్​ షా పహారా కాస్తుండగా.. తాలిబన్లు దాడి చేశారు. ఈ ఘటనలో షా తీవ్రంగా గాయపడినా.. లొంగకుండా వీరోచిత పోరాటం చేశాడు.

Afghan police
పోలీసు అధికారి అహ్మద్​ షా

" నేను వారికి లొంగలేదు, వారిపై పోరాటం కొనసాగించా. శత్రువులు చాలా బలహీనంగా ఉన్నారు. వారి విధానాలతో మమ్మల్ని భయపెట్టాలనుకున్నారు. కానీ, నిజ జీవితంలో ఏ ఒక్కరు.. శత్రువును చూసి భయపడకూడదని నేను తెలుసుకున్నా. అఫ్గాన్​ భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. వారిపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు తాలిబన్లు యత్నిస్తున్నారు."

- అహ్మద్​ షా, పోలీసు అధికారి

తాలిబన్ల దాడిపై సమాచారం అందుకున్న అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని షాను రక్షించాయి. ప్రస్తుతం షా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాందహార్​ నగరాన్ని చేజిక్కించుకునేందుకు తమ ఆపరేషన్​ను రెండు వారాల క్రితమే ప్రారంభించారు తాలిబన్లు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు.

ఇదీ చూడండి: దళాల ఉపసంహరణతో పేట్రేగుతున్న తాలిబన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.