అఫ్గానిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కాబుల్లో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదని అధికారులు తెలిపారు.
ఇదే రహదారిపై గత వారం రోడ్డు ప్రమాదం జరిగి 14మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి: కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి