అఫ్గానిస్థాన్ హెల్మాండ్ రాష్ట్రంలోని నావా జిల్లాలో ఆ దేశ వైమానిక దళం జరిపిన దాడిలో అల్‌ఖైదాకు చెందిన 11మంది ఉగ్రవాదులు సహా మరో ఇద్దరు తాలిబన్లు హతమయ్యారు. ఆ దేశ రక్షణ శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో అల్‌ఖైదాకు చెందిన ఉగ్రనేతలు మరణించారని పేర్కొంది.
అల్‌ఖైదా ఉగ్రవాదులు.. తాలిబన్లకు పేలుడు పరికరాలను తయారు చేయడం, ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
గతవారం హెల్మాండ్, కాందహార్ రాష్ట్రాల్లో జరిగిన వైమానిక దాడుల్లో పలువురు ముష్కరులను మట్టుబెట్టాయి అఫ్గాన్ సేనలు.
ఇదీ చూడండి: మంచు చరియలు విరిగిపడి 12 మంది మృతి