ప్రపంచ వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' గోడలు బీటలు వారుతున్నాయి. ప్రకృతి విపత్తులు, భూకంపాలు, భారీ వర్షాల ధాటికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. పర్యటకుల రద్దీ కూడా గోడ దెబ్బతినడానికి ఓ కారణమని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
గోడ మరమ్మతులకు ఇటుకలను వాడినా ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. ఫలితంగా.. సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. విద్యుత్ యంత్రాల సహాయంతో 100 కిలోల బరువు గల రాళ్లను అమర్చుతూ మరమ్మతులు చేపడుతున్నారు.
బీజింగ్ నగర సరిహద్దులోని 'బాడలింగ్ గ్రేట్ వాల్' చైనా గోడలో ప్రధాన భాగం. అత్యంత ఆకర్షణగా ఉండే ఈ ప్రాంతాన్ని గతేడాది దాదాపు కోటి మందికి పైగా పర్యటకులు సందర్శించారు.. ఈ తాకిడిని నియంత్రించేందుకు రోజుకు 65 వేల మందిని మాత్రమే సందర్శనకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం నిబంధన విధించింది.
ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్లో పేలుడు.. 12 మంది మృతి!