ఉత్తర కొరియాలో కిమ్‌జాంగ్ ఉన్ నియంతృత్వ పాలన ఎంత అరాచకంగా ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగుచూసింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్‌ను తమ దేశంలోకి అక్రమ రవాణా చేసిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది కిమ్ సర్కార్. అతడ్ని కాల్చి చంపాలని ఆదేశించింది. అంతేగాక ఈ సిరీస్‌ను యూఎస్బీలో కాపీ చేసుకున్నందుకు ఓ హైస్కూల్ విద్యార్థికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. స్క్విడ్ గేమ్ చూసిన అతని ఆరుగురు స్నేహితులను ఐదేళ్లు జైలులో ఉంచాలని ఆదేశించింది. అంతేగాక వీరిని పర్యవేక్షించే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. వారు మారుమూల గునుల్లో కూడా పని చేయకుండా నిషేధం విధించింది. ఉత్తర్ హాంగ్యోంగ్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది(north korea squid game).
శత్రు దేశం నుంచి వచ్చిందని...
దక్షిణ కొరియా ఇతివృత్తంగా రూపొందించిన స్క్విడ్ గేమ్ కారణంగా పిల్లలు చదువు నుంచి దృష్టి మళ్లించే అవకాశముందనే సాకుతో ఆ వెబ్‌సిరీస్‌ను తమ దేశంలో నిషేధించింది ఉత్తరకొరియా(north korea news). దీన్ని చూసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అయితే ఓ వ్యక్తి ఈ సిరీస్‌ను అక్రమంగా ఉత్తర కొరియాలోని రవాణా చేశాడు. దాన్ని ఓ హైస్కూల్ విద్యార్థికి రహస్యంగా విక్రయించాడు. యూఎస్బీ డ్రైవ్‌లో అతడు వెబ్ సిరీస్‌ను కాపీ చేసుకున్నాడు. అనంతరం స్కూల్‌కు వెళ్లాక తన బెస్ట్ ఫ్రెండ్‌కు ఆ విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా స్క్విడ్ గేమ్ సిరీస్ చూశారు(north korea squid game news). అయితే విద్యార్థి మిత్రుడు తాము సిరీస్ చూసిన విషయాన్ని మరొకరికి చెప్పాడు. ఇలా మొత్తం ఆరుగురు దీన్ని వీక్షించారు. ప్రభుత్వం సెన్సార్ల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టింది. విచారణ జరిపి అందరికీ శిక్ష విధించింది. అయితే ధనికుడి కుమారుడు కూడా ఈ సిరీస్ చూసినప్పటికీ 3000డాలర్లు అధికారులకు లంచంగా ఇవ్వడం వల్ల అతని పేరు బయటకు రాలేదనే ప్రచారం జరుగుతోంది(squid game news).
ఏంటీ స్క్విడ్ గేమ్?
నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 17న విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది(squid game north korea). గత రికార్డులను చెరిపేసి కోట్లు వీక్షణలు కొల్లగొట్టింది. ఇప్పటి వరకు మరే సిరీస్‌కు రానంత ప్రేక్షకాదరణ చూరగొంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి జీవితం మీది విరక్తి చెందిన 456 మంది ఓ గేమ్‌లో పాల్గొనడమే ఈ సిరీస్ ఇతివృత్తం. గెలిచిన వారికి 38 మిలియన్ డాలర్లు(రూ.283కోట్లు) ప్రైజ్ మనీ దక్కుతుంది. కానీ ఓడిపోతే మాత్రం చావే శరణ్యం. జంప్ సూట్ ధరించిన సిబ్బంది ఆటలో ఓడిపోయిన వారిని తుపాకీతో కాల్చి చంపుతారు. 9 ఎపిసోడ్లలో సాగే ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠతో అలరిస్తుంది(squid game north korea news). 456 మందిలో చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు.
ఇదీ చదవండి: China population: పెళ్లికి యువత 'నో'.. జనాభా సంక్షోభంలో చైనా!