ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్ ఎవరెస్ట్.. తాజా ఎత్తును సంయుక్తంగా ప్రకటించాయి నేపాల్-చైనా. ఆ శిఖరం 8,848.86 మీటర్ల(29,032 అడుగులు) ఎత్తు ఉందని వెల్లడించింది. పాత లెక్కల కన్నా ఇది 86 సెంటీమీటర్లు ఎక్కువ.
2015లో వచ్చిన భూకంపంతో పాటు ఇతర కారణాల వల్ల.. ఎవరెస్ట్ ఎత్తు తగ్గిపోయిందన్న ఊహాగానాల నేపథ్యంలో సర్వే చేపట్టింది నేపాల్. ఏడాది పాటు సాగిన ఈ ప్రక్రియలో చైనా సాయం తీసుకుంది.
2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత సర్వే విభాగం 1954లో ఎవరెస్ట్ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా తేల్చింది. అప్పటి నుంచి అవే గణాంకాలు ప్రామాణికంగా ఉన్నాయి.
ఇదీ చూడండి: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!