ఓ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది.
ఇదీ జరిగింది
ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది బరవాలా నుంచి లాహోర్‌కు కారులో వెళ్తున్నారు. అదుపు తప్పిన కారు.. లుదాన్ ప్రాంతం వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. మృతదేహాలను బరవాలా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.
ఈ ఘటనపై పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కరోనా విలయం: రాత్రిళ్లూ మృతదేహాల ఖననం