ETV Bharat / international

'అఫ్గాన్​లో 75శాతం మంది బాలికలు మళ్లీ బడిబాట' - afghan girls education news

అఫ్గాన్​లో బాలికలు తిరిగి పాఠశాలలకు(afghan girls education ) హాజరవుతున్నారని ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి తెలిపారు. పాకిస్థాన్ వార్తా సంస్థ డాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

75 pc Afghan girls back in school, claims acting FM Amir Khan Muttaqi
'అఫ్గాన్​లో 75శాతం బాలికలు మళ్లీ బడిబాట!'
author img

By

Published : Nov 13, 2021, 4:12 PM IST

అఫ్గానిస్థాన్​లో 75శాతం మంది బాలికలు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారని(afghan girls education ) తాలిబన్లు తెలిపారు. అఫ్గాన్​లో బాలికల విద్యా హక్కుల పరిస్థితిపై పాకిస్థాన్ వార్తా సంస్థ డాన్​ అడిగిన ఓ ప్రశ్నకు అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్​ మట్టాఖి ఈ మేరకు బదులిచ్చారు.

ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు(afghan taliban ) పాఠశాలలను మూసివేశారు. దీంతో వేలాది మంది బాలికలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం చేపట్టాక తాము మహిళల హక్కులు, వారి విద్యా హక్కులకు(afghanistan girls education) ఎలాంటి భంగం కలిగించబోమని తాలిబన్లు చెప్పినప్పటికీ.. ఇంతకాలం వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. మహిళలు, బాలికల పట్ల వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకుండా, పనులకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్​లోని అన్ని ఉన్నత పాఠశాలలను ఇటీవలే తిరిగి ప్రారంభించింది విద్యాశాఖ. అయితే ఇది బాలురకేనని ఆదేశాల్లో పేర్కొంది. బాలికల(afghanistan women news) ప్రస్తావన ఎక్కడా లేదు.

అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాత్రం.. బాలికలు అతి త్వరలో పాఠశాలలకు హాజరవుతారని(afghanistan girls education news), వారికి చదువుచెప్పే మహిళా టీచర్లు కూడా విధులకు వస్తారని పేర్కొన్నారు. ఈ తరుణంలో.. బాలికలు ఇప్పటికే పాఠశాలలకు వెళుతున్నారని తాలిబన్లు చెప్పడం గమనార్హం.

అంతకుముందు అఫ్గాన్​లో బాలికల పరిస్థితిపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి తెరవాలని సూచించింది. తాలిబన్లు బాలికలను పాఠశాలల్లో చదువుకునేందుకు అనుమతిస్తారో లేదో చూడాలని యూనిసెఫ్ ప్రతినిధి చెప్పారు.

ఇదీ చదవండి: 'గ్రాండ్​పేరెంట్​ స్కామ్'.. వృద్ధురాలికి రూ.5 కోట్లు టోకరా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.