ఇండోనేసియాలోని బాలీ దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదైనట్లు అమెరికా భౌగోళిక సంస్థ(యూఎస్జీఎస్) తెలిపింది. దక్షిణ ఇండోనేసియా దీవుల్లోని బాలీ ప్రాంతంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు భూమి కంపించింది.
నుసా దువా పట్టణానికి దక్షిణాన సుమారు 255 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కలుషిత గాలి పీల్చుతున్నారా? అయితే బరువు పెరగడం ఖాయం!