చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌ను భారీ భూకంపం(Earthquake today) కుదిపేసింది. లుజౌ నగరంలోని లుగ్జియన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు రాగా రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ప్రకంపనల(earthquake in China) దాటికి అక్కడి ఇళ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మృతులు ఫుజీ టౌన్‌షిప్‌లోని ఓ గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
తెల్లవారు జామున అందరూ నిద్రిస్తున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించినట్లు (Earthquake today) స్థానికులు తెలిపారు. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 4.33 గంటలకు భూమి కంపించగా.. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు చైనా భూకంప కేంద్రం తెలిపింది.
ప్రావిన్స్ ప్రభుత్వం అప్రమత్తమై.. రెండో అత్యధిక ఎమర్జెన్సీ స్పందన వ్యవస్థను రంగంలోకి దింపింది. అలాగే.. లుజౌ నగర అధికారులు సైతం.. సహాయక చర్యలు, దర్యాప్తునకు మొదటి రెస్పాన్స్ బృందాలను మోహరించారు.
ఇదీ చూడండి: చైనాలో వరుస భూకంపాలు- ముగ్గురు మృతి