పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు సహా ఓ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలిపారు.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులోని దర్వాజ్‌గై చెక్ పోస్ట్‌కు సమీపంలో ఉన్న లాందీకోటల్ పట్టణంలోని ఓ ఇంటి వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్.
ఇదీ చూడండి: ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష