Bouncy Castle: ఆస్ట్రేలియాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పిల్లలు ఆడుకునే బౌన్సీ క్యాజిల్ గాల్లోకి ఎగరగా.. ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. టాస్మేనియాలోని హిల్క్రీస్ట్ ప్రైమరీ స్కూల్ విద్యా సంవత్సరం ముగింపు వేడుకల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బలమైన ఈదురు గాలులతో క్యాజిల్ పైకి ఎగరగా.. పిల్లలు 10 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడినట్లు తెలుస్తోంది.
మృతులు 6 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
గాయపడ్డవారిని హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలించారు. చిన్నచిన్న గాయాలైన పిల్లలకు పాఠశాల ఆవరణలోనే ప్రథమ చికిత్స నిర్వహించారు.
Australia Bouncy Castle Tragedy
టాస్మేనియా స్టేట్ ప్రీమియర్ పీటర్ గట్వెయిన్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
దీనిని అత్యంత విషాదకర ఘటనగా పేర్కొన్నారు టాస్మేనియా పోలీస్ కమాండర్ విలియమ్స్.
ఇదీ చూడండి: 'షీనా బోరా చనిపోలేదు.. కశ్మీర్లో ఉంది'.. సీబీఐకి ఇంద్రాణీ లేఖ