భారీ వర్షాలు, వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. కొండ చరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా సింధుపాల్‌చౌక్ జిల్లా బర్హాబైస్ రూరల్ మున్సిపాలిటీ-7లో కొండచరియలు విరిగిపడ్డాయి. 9 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికిపైగా ఆచూకీ గల్లంతయింది. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.
జిల్లాలోని భిర్ఖార్క ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడి 9 ఇళ్లు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయాయి. దాదాపు 25 మంది గల్లంతయినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనేది తెలియరాలేదు.
ఇదీ చూడండి: ప్రపంచ రారాజు.. అపర కుబేరుడు.. జెఫ్ బెజోస్