థాయిలాండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 29మంది మరణించారు. నాఖోన్ సి తమ్మరాత్ రాష్ట్రంలో అత్యధికంగా 21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి కురుస్తున్న వర్షాల వల్ల 11 దక్షిణాది రాష్ట్రాల్లో 101 జిల్లాల్లోని 5 లక్షల 55 వేలమందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు.
సహాయక చర్యలను ముమ్మరం చేశాయి విపత్తు నిర్వహణ దళాలు. లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి.. ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: రైతులకు అమెరికా నేతలు, సిక్కుల మద్దతు