రంజాన్ మొదలైనప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లో జరిగిన 15 ఆత్మాహుతి దాడులు, ఇతర లక్షిత దాడుల కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా క్షతగాత్రులైనట్లు టోలో వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఏప్రిల్ 13 నుంచి తాలిబాన్లు.. 200లకు పైగా బాంబు దాడులు జరిపినట్లు స్పష్టం చేసింది.
గత నెలతో పోల్చితే.. ఈనెలలో బాంబు దాడుల్లో మృతిచెందిన పౌరుల సంఖ్య 20 శాతం పెరిగినట్లు 'టోలో' పేర్కొంది.
"భద్రతా దళాలకు ధన్యవాదాలు. 800 దాడి ఘటనలను వారు నిలువరించారు. 800 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు."
--అశ్రఫ్ ఘని, అఫ్గాన్ రాష్ట్రపతి.
అమెరికా బలగాల ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి అఫ్గాన్‌లో తాలిబాన్ల బాంబు దాడులు పెరిగాయి. ఇప్పటికే చాలా మంది అఫ్గాన్ భద్రతా దళాలు, పౌరులు మృతిచెందారు.
ఇదీ చదవండి:'కరోనాపై పోరులో భారత్‌కు మా మద్దతు ఆగదు'