ETV Bharat / international

రాకెట్​ దాడిలో 200 మంది తాలిబన్లు హతం - అఫ్గానిస్థాన్​లో రాకెట్ దాడి

అఫ్గానిస్థాన్​లో అల్లకల్లోలం సృష్టిస్తున్న తాలిబన్లను నిలువరించేందుకు అమెరికా రాకెట్ దాడులను ప్రారంభించింది. ఈ మేరకు జరిపిన వైమానిక దాడిలో 200 మంది తాలిబన్లు హతమైనట్లు అఫ్గాన్​ అధికారులు పేర్కొన్నారు. హెరాత్​ ప్రాంతంలో అమెరికా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

us, us air strike
అమెరికా, తాలిబాన్లు
author img

By

Published : Aug 1, 2021, 11:40 PM IST

అప్గానిస్థాన్​లోని హెరాత్ ప్రాంతంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో కనీసం 200 మంది తాలిబన్లు మరణించారు. దీనితో హెరాత్​ ప్రావిన్స్​ను ఆక్రమించకుండా తాలిబన్లను నిలువరించగలిగారు. ఈ మేరకు స్థానిక మీడియా 'అఫ్గానిస్థాన్ టైమ్స్​' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడులపై అటు అమెరికా గానీ.. తాలిబన్లు గానీ స్పందించలేదు.

హెరాత్​ పరిధిలో ఉన్న గోజరా జిల్లాను తాలిబాన్లు గురవారం హస్తగతం చేసుకున్నారు. ఈ నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం గమనార్హం.

'అమెరికా వైమానిక దళానికి చెందిన జెయింట్ బీ-52 విమానం తాలిబన్ల స్థావరాలపై బాంబు దాడి జరిపింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మరణించారు' అని హెరాత్ చట్టసభ ప్రతినిధి జిలానీ ఫర్హాద్​ తెలిపారు. దీనితో పాటు వివిధ ప్రాంతాల్లో అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు తాలిబన్లు హతమయ్యారని వివరించారు.

మరోవైపు అఫ్గాన్​ వ్యాప్తంగా తాలిబన్ల దురాక్రమణలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే 193 జిల్లా కేంద్రాలతో పాటు.. 19 సరిహద్దు జిల్లాలను వారు ఆక్రమించినట్లు అఫ్గాన్​ విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఏప్రిల్​ 14 నుంచి దాదాపు 4 వేల మంది అఫ్గాన్​ సైన్యం తాలిబాన్ల చేతిలో మృతిచెందగా.. 7 వేల మందికి పైగా గాయపడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే 1600 మంది తాలిబన్లను సైన్యం బంధించినట్లు వెల్లడించింది. ఇక రెండు వేల మంది పౌరులు మృతిచెందినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:'అఫ్గాన్​లో పట్టుబిగిస్తున్న తాలిబాన్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.