కుక్కలు మనుషుల్ని కరవడం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాము. శునకాల దాడిలో మనుషులకు తీవ్ర గాయాలు కూడా అవుతూ ఉంటాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. జనావాస ప్రాంతాల నుంచి శునకాలను అధికారులు తరలించడం చూస్తూనే ఉంటాము. అయితే పాకిస్థాన్‌లోని రెండు శునకాలు.. ఓ వ్యక్తిని కరిచిన కారణంగా.. 'మరణ శిక్ష'ను ఎదుర్కొంటున్నాయి.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ కరాచీలోని సీనియర్ న్యాయవాది మీర్జా అఖ్తర్.. మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు. అదే సమయంలో జర్మన్ షెపార్డ్ జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలు.. ఆయనపై దాడి చేశాయి. ఆయన ఏం చేయకుండానే కరిచేశాయి. దీంతో మీర్జా అఖ్తర్‌కు తీవ్ర గాయాలయ్యారు. కుక్కలు న్యాయవాదిని నేల మీద పడేసి దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉండే సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
-
Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL
— Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL
— Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL
— Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021
అయితే ఈ రెండు శునకాలు ఆ పొరుగున ఉన్న హుమాయున్ ఖాన్‌కు చెందినవి. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. శునకాల యజమానిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సరైన శిక్షణ లేకుండా నివాసిత ప్రాంతాల్లో ఇలాంటి శునకాలను ఎలా ఉంచుకుంటున్నారని పలువురు ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మీర్జా అఖ్తర్.. కోర్టు వరకు తీసుకెళ్లారు. తర్వాత.. మీర్జా- హుమాయున్ మధ్య కోర్టుబయట కుదిరిన ఒప్పందంతో పరిస్థితి సద్దుమణిగింది.
మీర్జా అఖ్తర్ డిమాండ్లు..
- ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ.. హుమాయున్ క్షమాపణలు చెప్పాలి.
- పశువైద్యుల సమక్షంలో ఆ రెండు శునకాలను తక్షణమే చంపేయాలి.
- హుమాయున్ వద్ద వేరే కుక్కలు ఉంటే.. వాటిని ఇతరులకు ఇచ్చేయాలి.
ఈ షరతులకు అంగీకారం తెలుపుతూ ఇరువురు సంతకం చేసిన పత్రాలను కోర్టుకు సమర్పించారు.
అయితే ఈ వ్యవహారంపై జంతుప్రేమికులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. కుక్కల యజమాని- న్యాయవాది మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఖండిస్తున్నారు.
ఇదీ చూడండి:- చనిపోయిన యజమాని ఫొటో చూస్తూ విలపిస్తున్న శునకం