సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
హెనాన్ ప్రావిన్స్‌లోని జెచెంగ్ కౌంటీలో తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసి పడ్డాయి.