పాకిస్థాన్ రహీమ్యార్ ఖాన్ సమీపంలో.. లియాఖత్పుర్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీ-రావల్పిండి తేజ్గ్రామ్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 65 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయని పాక్ రైల్వే అధికారులు వెల్లడించారు. విస్తరించిన మంటలతో మొత్తం మూడు కోచ్లు దగ్ధమయ్యాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.
ఈ దుర్ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.