ETV Bharat / international

గన్​పౌడర్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు-16 మంది మృతి - గన్​పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు

రష్యాలో ఓ గన్​పౌడర్​ పరిశ్రమలో జరిగిన పేలుడులో 16 మంది మరణించారు. ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Russian gunpowder factory blast
గన్​పౌడర్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
author img

By

Published : Oct 22, 2021, 5:21 PM IST

రష్యాలోని గన్​పౌడర్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. తొలుత ఏడుగురు చనిపోగా.. తొమ్మిది మంది అచూకీ గల్లంతైనట్లు తెలిపిన అధికారులు.. కాసేపటికే అదృశ్యమైనవారు కూడా చనిపోయినట్లు వెల్లడించారు.

మాస్కోకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 170 మంది సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టగా.. 50 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది.

ఇదీ చూడండి: చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తి- స్కూళ్లు, విమానాలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.