కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. అయితే అంతర్జాల వినియోగంలో ఎక్కువశాతం అశ్లీల చిత్రాల వీక్షణకే ఉపయోగిస్తున్నారని పలు అధ్యాయనాలు తేటతెల్లం చేస్తున్నాయి! కంప్యూటర్, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్లిక్ దూరంలోనే ఇవి దొరికేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా సాగుతున్న పోర్న్ఇండస్ట్రీ.
ఇటీవల నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా.. నీలి చిత్రాల దందా కేసులో అరెస్ట్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే మన దగ్గర మినహా చాలాదేశాల్లో ఈ వ్యాపారం చట్టపరమే! అందుకే అక్కడ భారీ స్థాయిలో ఈ అశ్లీల కంటెంట్ అంతర్జాలంలో వినియోగదారులకు సులువుగా దొరికేస్తోంది. అయితే ఈ పోర్న్ ఇండస్ట్రీ ఇంతలా అభివృద్ధి చెందడానికి డిమాండ్ అండ్ సప్లై కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.
అప్పటి నుంచే
20శతాబ్దం ముందు వరకు ఈ పోర్నోగ్రఫీ అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కార్పొరేట్ ఇందులోకి రంగ ప్రవేశం చేసిందో అప్పటినుంచి ఈ ఇండస్ట్రీ పరిధి ఎవరూ ఊహించలేనంతగా పెరిగింది. ఆర్ధికంగానూ ఎంతో బలపడింది. అయితే ఈ ఇండస్ట్రీలో వేధింపులు, కంటెంట్ పైరసీ, అవినీతి వంటి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
అశ్లీల కంటెంట్ ఎక్కువగా ప్రొడక్షన్ చేసే దేశాలు
- అమెరికా: 24.52 శాతం
- యునైటెడ్ కింగ్డమ్: 5.49 శాతం
- జర్మనీ: 4.90 శాతం
- బ్రెజిల్: 4.80 శాతం
- ఫ్రాన్స్: 4.01 శాతం
- రష్యా 4.01 శాతం
- కెనడా 3.19 శాతం
- భారత్ 3.18 శాతం
- ఇటలీ 2.64 శాతం
- స్పెయిన్ 2.46 శాతం
- నెథర్లాండ్స్ 1.92 శాతం
- టర్కి 1.82 శాతం
- పొలాండ్ 1.78 శాతం
- ఆస్ట్రేలియా 1.55 శాతం
ఇదీ చూడండి: అశ్లీలానికి ప్రభావితమై నేరస్థులుగా మారుతున్న విద్యార్థులు