ఫలితాలు తేలక ఉత్కంఠ నెలకొన్నప్పటికీ డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి కమలా హారిస్ మనుమరాలితో ముచ్చటించి కాసేపు సేదతీరారు. మీనా హారిస్ (చెల్లెలు మాయా హారిస్ కుమార్తె) కూతురును ఒడిలో పెట్టుకొని ముద్దులాడారు.
నేనూ అధ్యక్షురాలిని అవుతానని ఆ పాప అన్నప్పుడు "తప్పకుండా అవుతావు. అయితే ఇప్పుడు కాదు. 35 ఏళ్లు నిండిన తరువాత అవుదువుగాని" అని చెప్పారు. ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన ఈ వీడియో ఆదరణ పొందింది.
ఇదీ చదవండి:అధ్యక్ష పీఠానికి అత్యంత చేరువలో జో బైడెన్!