ETV Bharat / international

'యోగా ఫ్రమ్​ హోం'కు అమెరికన్లు సన్నద్ధం

6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'యోగా ఫ్రమ్​ హోం' థీమ్​తో జరుపుకోనున్నారు అమెరికన్లు. కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో ఈ మేరకు ఇళ్ల నుంచే యోగా చేయనున్నారు. వీరికి ప్రముఖ యోగా గురువు రాందేవ్​ బాబా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

Yoga from home to mark International Yoga Day this year in US
'యోగా ఫ్రమ్​ హోం'కు అమెరికన్లు సన్నద్ధం
author img

By

Published : Jun 14, 2020, 12:41 PM IST

ఈ నెల 21న జరగనున్న 6వ యోగా అంతర్జాతీయ దినోత్సవం కోసం అమెరికన్ ​వాసులు ఎంతో కుతూహలంగా ఉన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఈసారి సామూహికంగా కాకుండా.. ఇళ్లల్లోనే ఉంటూ యోగా చేయాలని నిర్ణయించుకున్నారు.

"ఈ ఏడాది 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందుకోసం 'యోగా ఫ్రమ్​ హోం' అనే థీమ్​ను ఎంచుకున్నాం. మనిషి ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ అనేకమార్లు వ్యాఖ్యానించారు. కరోనా వైరస్​ మన రోజువారీ జీవితాలను కుదిపేసింది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా మరింత అవసరమైంది. ప్రజలు యోగాతో స్ఫూర్తిపొంది తమ జీవితాల్లో ఒక భాగం చేసుకుంటారని ఆశిస్తున్నా."

-- తరంజిత్​ సింగ్​ సంధు, అమెరికాలోని భారత రాయబారి.

అమెరికాలోని యోగా ఔత్సాహికుల కోసం ప్రముఖ యోగా గురువు రాం​దేవ్​ బాబా ప్రత్యేకంగా ఆన్​లైన్​ సెషన్​ను నిర్వహించనున్నారు. యోగాసనాలు, శ్వాస సంబంధిత ప్రాణాయామం, ధ్యానంపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సెషన్​ను స్థానిక సంస్థలతో కలిసి హ్యూస్టన్​లోని ఇండియన్​ కాన్సులేట్​ ఏర్పాటు చేసింది. ఇది వాషింగ్టన్​లోని ఇండియన్​ హౌస్​​లో కూడా ప్రసారమవుతుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత ఐదేళ్లుగా అమెరికాలోని నేషనల్​ మాన్యుమెంట్​, యూఎస్​ కాపిటల్​లో జరుపుకునే వారు. ఈసారి కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుంచే యోగా చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.