ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి 71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 6 లక్షల 70 వేల మంది మృతి చెందారు. సుమారు కోటి 6 లక్షలకుపైగా బాధితులు కోలుకున్నారు.
అమెరికా అతలాకుతలం..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి కబలించేస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 66,921 కేసులు నమోదయ్యాయి. 1,485 మంది మృత్యువాతపడ్డారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య లక్షా 53 వేలు దాటాయి. అయితే ఇప్పటి వరకు మొత్తంగా 22 లక్షలకు పైగా బాధితులు వ్యాధి నుంచి కోలుకుని బయటపడ్డారు.
బ్రెజిల్లో...
బ్రెజిల్లో అమెరికాను మించి కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 70,869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,554 మంది వైరస్ ధాటికి మరణించారు.
స్థిరంగా పెరుగుదల...
రష్యాలో స్థిరంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 5,475 కేసులు, 169 మరణాలు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికా, స్పెయిన్, మెక్సికో, పెరూ, చిలీ, ఇరాన్, కొలంబియాలో రోజురోజుకు మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది.
దేశాల వారీగా కరోనా విలయం
దేశం | కొత్త కేసులు | మొత్తం కేసులు | కొత్త మరణాలు | మొత్తం మరణాలు |
అమెరికా | 66,921 | 45,68,037 | 1,485 | 1,53,840 |
బ్రెజిల్ | 70,869 | 25,55,518 | 1,554 | 90,188 |
రష్యా | 5,475 | 8,28,990 | 169 | 13,673 |
దక్షిణాఫ్రికా | 11,362 | 4,71,123 | 240 | 7,497 |
మెక్సికో | 7,208 | 402,697 | 854 | 44,876 |