ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 3.61 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10.55 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారినపడిన వారిలో 2.71 కోట్ల మంది కోలుకున్నారు. మరో 78.74 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
- కొవిడ్ కేసులు, మృతుల పరంగా తొలిస్థానంలో అమెరికా ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 77.26 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2లక్షల 15వేల మందికిపైగా మరణించారు.
- రష్యాలో కొత్తగా 11,115 కరోనా కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 12,48,619కు పెరిగింది. వైరస్ ధాటికి మరో 202 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 21,865కు చేరింది.
- మెక్సికోలో మరో 4,828 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 7,94,608కి పెరిగింది. మరో 471 మంది కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 82,348కి చేరింది.
- పాక్‌లో బుధవారం 624 మందికి వైరస్ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3,16,351కి చేరింది. ఇప్పటివరకు అక్కడ 6,535 మంది వైరస్‌కు బలయ్యారు.
- నేపాల్‌పై కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 3,439 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో కేసుల సంఖ్య 94,253కు పెరిగింది.
ఇదీ చదవండి: మాస్క్ విషయంలో గొడవ.. విమానం నుంచి దించేశారు!