ETV Bharat / international

'ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది నర్సుల కొరత' - నర్సుల కొరత

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో 6 మిలియన్ల మంది నర్సుల కొరత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరోగ్య వ్యవస్థకు నర్సులు వెన్నెముక లాంటి వారని కొనియాడారు డబ్ల్యూహెచ్​ఓ సారథి టెడ్రోస్.

World short of six million nurses, WHO says
అంతర్జాతీయంగా 60 లక్షల మంది నర్సుల కొరత: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Apr 7, 2020, 10:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది నర్సుల కొరత ఉందని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ, వైద్య వ్యవస్థపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతున్న వేళ ఈ ఆందోళనకర వాస్తవాలను బయటపెట్టింది.

'ఆరోగ్య రంగానికి నర్సులు వెన్నెముక లాంటి వారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28 మిలియన్ల మంది నర్సులు మాత్రమే ఉన్నప్పటికీ... వీరు ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి 2018 వరకు వీరి సంఖ్య 4.7 మిలియన్లు పెరిగింది. అయినప్పటికీ 5.9 మిలియన్ల మంది నర్సుల కొరత ఉంది' అని అన్నారు డబ్ల్యూహెచ్​ఓ అధినేత టెడ్రోస్.

ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో నర్సుల కొరత ఎక్కువగా ఉందన్నారు టెడ్రోస్. ప్రభుత్వాలు నర్సింగ్​ విద్య, ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు.

ప్రజల కోసం త్యాగాలు...

మహమ్మారి కారణంగా ఇటలీలో 23 మంది నర్సులు చనిపోగా, ప్రపంచ వ్యాప్తంగా 100 మంది వైద్య సిబ్బంది మృతి చెందినట్లు అంతర్జాతీయ నర్సుల మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి హోవార్డ్ కాటన్​ వెల్లడించారు. ఇటలీలో 9 శాతం మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకగా, ఈ సంఖ్య స్పెయిన్​లో 14 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.