ETV Bharat / international

'పెద్దన్నతో కలిసి పని చేసేందుకు సిద్ధం'

ట్రంప్​ వైఖరితో విసిగిపోయిన ప్రపంచ దేశాల నేతలు అమెరికాలో నూతనంగా కొలువుదీరిన జో బైడెన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాతో మైత్రీ సంబంధాలను తిరిగి కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

World leaders looking forward to working with President Biden
'పెద్ధన్నతో కలిసి పని చేసేందుకు సిద్ధం'
author img

By

Published : Jan 21, 2021, 5:00 PM IST

అగ్రరాజ్య అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్​కు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రసంగించిన బైడెన్.. ప్రపంచదేశాలతో తిరిగి సంబంధాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రత కోసం బలమైన, నమ్మకమైన భాగస్వామి కోసం అమెరికా ఎదురుచూస్తోంది అన్నారు. గతంలో జరిగిన వాటి గురించి తాము ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అగ్రరాజ్యంతో మైత్రీ సంబంధాలను నెలకొల్పేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.

ఎవరేమన్నారు?

"అమెరికా అధ్యక్షుడు బైడెన్​కు అభినందనలు. నాలుగేళ్ల తరువాత మీతో మైత్రీ సంబంధం కొనసాగించడానికి ఐరోపా సిద్ధంగా ఉంది."

-ఉర్సులా వాన్​డెర్​ లియోన్ , ఐరోపా సమాఖ్య కమిషన్ అధ్యక్షురాలు

"బైడెన్​, కమలకు శుభాకాంక్షలు. అమెరికా, ఐరోపా మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇది సరైన సంమయం అని అనుకుంటున్నాం."

-చార్లెస్​ మైకేల్​, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు

"అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం.. అగ్రరాజ్యానికి-అట్లాంటిక్ కూటమి మధ్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. చైనా ఆధిపత్య ధోరణికి, అఫ్గానిస్థాన్​, ఇరాక్​ లాంటి ఉగ్రవాద దేశాలతో ఉన్న భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి 'నాటో' సభ్యదేశాలు కలిసి ఏకతాటిపైకి రావాల్సిందిగా కోరుతున్నా."

-నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

"బైడెన్.. మీకు అభినందనలు. ప్రపంచ మానవాళి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దూరదృష్టితో మీ ఆలోచనలు వాటికి మార్గనిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నాను."

-పోప్​ ఫ్రాన్సిస్​

"అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్​కు హృదయపూర్వక అభినందనలు. భారత్​- అమెరికా వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేందుకు.. బైడెన్​తో కలిసి పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్​.. మీకు శుభాకాంక్షలు. మీ రాకతో అమెరికా, జర్మనీ మధ్య మైత్రీ సంబంధాలు మరింత మెరుగుపడుతాయి అని భావిస్తున్నాం."

-జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్

"పర్యావరణహితం అనేది అందరికీ సంబంధించింది. ప్యారిస్​ పర్యాపరణ ఒప్పందంపై ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై మనం కలిసి పోరాడదాం. భూమిని రక్షించుకుందాం."

-ఇమ్మాన్యుయేల్ మేక్రాన్​, ఫ్రాన్స్ అధ్యక్షుడు

"కరోనా, వాతావరణ మార్పులు, రక్షణ, భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణలో కలిసి పోరాడదాం. ఇందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్​ ప్రధాని

రష్యా, చైనా ఇలా..

రష్యా, అమెరికా మధ్య మరింత నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్​ అధ్యక్షునిగా ఉన్న సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చైనా పిలుపునిచ్చింది. డ్రాగన్​, అగ్రదేశం మధ్య తెగిన సంబంధాలను పునరుద్ధరణకు కృషి చేయాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. 2015లో చేసుకున్న అణు ఒప్పందాన్ని తిరిగి తీసుకురావాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కోరారు. తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్‌కు సూచించారు.

"అధ్యక్షుడు బైడెన్​కు అభినందనలు. మన మధ్య గత కొన్నిఏళ్లుగా మంచి స్నేహం ఉంది. అమెరికా-ఇజ్రాయెల్​ మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళదాం. తీవ్రవాదంపై కలిసిపోరాడదాం."

-నెతన్యాహూ, ఇజ్రాయెల్​ ప్రధాని

"ఇండో-పసిఫిక్​ సంబంధాలను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో అమెరికాతో కలిసి పని చేస్తాం."

-యోషిహిడే సుగా, జపాన్​ ప్రధాని

ప్రపంచ జీవ కోటి పర్యాపరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూతాపంతో ప్రపంచంలోని అన్ని జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అనేక మంది ఆందోళనలు చెందుతున్నారు. అధ్యక్షుడిగా బైడెన్​ ఆధ్వర్యంలో అమెరికా ప్యారిస్​ ఒప్పందంలో తిరిగి చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది.

- దలైలామా, బౌద్ధ మత గురువు

ఇవీ చూడండి:

జో బైడెన్​కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

'డబ్ల్యూహెచ్​ఓకు బైడెన్ పూర్తి​ మద్దతు'

బైడెన్ రాకతో ప్రపంచ దేశాలపై వాణిజ్య ప్రభావమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.