ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 28 లక్షలు దాటిన కేసులు - Coronavirus majorly affected citiesworld corona cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 28.64 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. 18లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

corona statistics
ప్రపంచంపై కరోనా పంజా
author img

By

Published : Apr 25, 2020, 9:14 PM IST

ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. కొత్తగా 35,480మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 2,406మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 18,48,351కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 58,352 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది.

corona statistics
భారత్​లో కరోనా గణాంకాలు

అమెరికాలో..

వైరస్​తో తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలో కొత్తగా 178మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. 3,995 మందికి కొత్తగా కరోనా సోకింది. 7,66,153కిపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15,097మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఐరోపాలో..

ఐరోపాలో వైరస్ కారణంగా 1,20,140మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ దేశాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. 13లక్షల 44వేలకు పైగా వైరస్ బారినపడ్డారు.

అమెరికా, ఇటలీ తర్వాత కరోనాతో అత్యంత ప్రభావితమైన స్పెయిన్​లో మరో 378మంది ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు వారాల్లో ఇదే అత్యల్పమని వెల్లడించారు అధికారులు.

శ్రీలంకలో నౌకదళ సిబ్బంది నిర్బంధం..

శ్రీలంక నౌకదళానికి చెందిన 60మంది నౌకదళ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. నౌకాదళానికి చెందిన నాలుగు వేలమంది జవాన్లు, వారి కుటుంబాలను నిర్బంధంలో ఉంచారు. మార్చి 20 నుంచి శ్రీలంకలో ఆంక్షలు విధించారు. ఇప్పటివరకు అక్కడ 420మంది వైరస్ బారినపడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్​లో 618మందికి..

సింగపూర్​లో 618మందికి కరోనా సోకింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 12,693కు పెరిగింది. ఇప్పటివరకు 12మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్​లో మరో 76మంది..

ఇరాన్​లో వైరస్ కారణంగా మరో 76మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 5,650కి చేరింది. కొత్తగా 1,100 మందికి వైరస్ సోకింది.

ఇదీ చూడండి: అమెరికాకు వలసల బంద్​పై ట్రంప్​ భారీ స్కెచ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.