ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. ఒక్కరోజులో కొత్తగా 2.78 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 53 లక్షలు దాటిపోయింది. 7,116 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,29,297కి ఎగబాకింది.
అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ ఏమాత్రం శాంతించడం లేదు. మరో 71,501 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. 1,212 మంది కరోనాకు బలయ్యారు. అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య లక్షా 46 వేలు దాటిపోయింది.
బ్రెజిల్
అమెరికా తర్వాత బ్రెజిల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 65 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 22.31 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 82,890కి ఎగబాకింది.
దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా 13,150 మందికి కరోనా సోకింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. తాజాగా 572 మంది మరణించగా.. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 5,940 మంది కరోనా కాటుకు బలయ్యారు.
కొలంబియా
కొలంబియాలో వైరస్ విలయతాండవం చేస్తోంది. కొత్తగా 7,390 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 2.18 లక్షలుగా ఉంది. 207 మంది మరణించగా.. మొత్తం 7,373 మంది వైరస్ ధాటికి ప్రాణాలు వదిలారు.
మెక్సికో
మెక్సికోలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. తాజాగా 915 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 40,400కి చేరింది. కొత్తగా 6,859 కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,56,255కి చేరింది.
రష్యా
కొత్తగా 5,862 కేసులతో రష్యాలో కరోనా బాధితుల సంఖ్య 7,89,190కి చేరింది. తాజాగా 165 మంది వైరస్ ధాటికి ప్రాణాలు విడిచారు. రష్యాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,745కి చేరింది.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 41,00,070 | 1,46,141 |
బ్రెజిల్ | 22,31,871 | 82,890 |
రష్యా | 7,89,190 | 12,745 |
దక్షిణాఫ్రికా | 3,94,948 | 5,940 |
పెరూ | 3,66,550 | 17,455 |
మెక్సికో | 3,56,255 | 40,400 |
చిలీ | 3,36,402 | 8,722 |
స్పెయిన్ | 3,14,631 | 28,426 |
యూకే | 2,96,377 | 45,501 |