ETV Bharat / international

మేం దూసుకుపోతున్నాం.. గెలుపు నాదే: ట్రంప్ - తాజా వార్తలు ట్రంప్

యావత్‌ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు తనదే అని డొనాల్డ్​ ట్రంప్​ పునరుద్ఘాటించారు.

Winning is easy
గెలుపు నాదే.. వచ్చే నాలుగేళ్లూ నావే: ట్రంప్
author img

By

Published : Nov 4, 2020, 3:46 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై డొనాల్డ్​ ట్రంప్​ ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా గెలిచి తీరతానన్నారు. ఓటమి గురించి ఆలోచించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

"ఫ్లోరిడా, అరిజోనా, టెక్సాస్​ ఇలా ఎక్కడ చూసినా మేం దూసుకుపోతున్నాం. ఈ రోజు మనది.. వచ్చే నాలుగేళ్లూ మనవే. గెలుపు చాలా సులభం. నాకు ఓటమి లేనే లేదు. ఈ ర్యాలీల్లో జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు డొనాల్డ్​. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.