ETV Bharat / international

Delta Variant: టీకా తీసుకున్న వారి నుంచి 'డెల్టా' వ్యాపిస్తుందా? - డెల్టా వేరియంట్

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్​ దేశాల్లో డెల్టా రకం వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తోంది. భారత్​లోనూ మహారాష్ట్ర, కేరళలో ఈ రకం వైరస్​ విజృంభిస్తోంది. అయితే వ్యాక్సిన్​ తీసుకున్న వారి నుంచి ​కొవిడ్ వ్యాపించే అవకాశాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారు? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

covid delta variant
కరోనా డెల్టా వేరియంట్
author img

By

Published : Aug 13, 2021, 8:21 PM IST

కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్త రూపాలు సంతరించుకుంటోన్న కరోనా మహమ్మారి.. వ్యాక్సిన్‌ సమర్థతకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి కూడా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే ఆస్కారం ఉందని పలు దేశాల్లో జరుపుతోన్న అధ్యయానాల్లో వెల్లడవుతోంది. ముఖ్యంగా ఇతర రకాలతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి డెల్టా వేరియంట్‌ ఇతరులకు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్‌, అమెరికా దేశాల్లో జరిపిన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయినా ప్రమాదకర స్థితి బారినపడకుండా అడ్డుకోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్లతో వైరస్‌ వ్యాప్తి..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న వేళ.. వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్‌, అమెరికా దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌తో వైరస్‌ వ్యాప్తి మరోసారి పెరిగేందుకు కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌కు చెందిన ఫ్రొఫెసర్‌ రైమెర్‌స్మా నేతృత్వంలో తాజా అధ్యయనం చేపట్టారు. జూన్‌ 29 నుంచి జులై 31 వరకు చేపట్టిన ఈ అధ్యయనంలో మొత్తం 719 మందిని పరిగణలోకి తీసుకున్నారు. వారి పీసీఆర్‌ (PCR) టెస్టులను విశ్లేషించడం వల్ల థ్రెషోల్డ్‌ సైకిల్‌ (Ct)లపై అధ్యయనం జరిపారు. 719 మందిలో వ్యాక్సిన్‌ తీసుకున్న 311 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వారిలో Ct విలువ 25 కంటే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. Ct విలువ తక్కువగా ఉంటే వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉన్నట్లు భావిస్తారు. తద్వారా వ్యాక్సిన్‌ తీసుకోని, తీసుకున్న వారికి సంబంధం లేకుండా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి జరుగుతోందని సమాచార విశ్లేషణలో నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి స్వాబ్‌ (ముక్కు ద్వారా సేకరించిన) నమూనాల్లోనూ వైరల్‌ లోడ్‌ ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇక మసాచూసెట్స్‌ యూనివర్సిటీ నిపుణులు జరిపిన అధ్యయనాల్లోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. కొత్తగా వెలుగు చూస్తోన్న పాజిటివ్‌ కేసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనే ఎక్కువగా ఉంటున్నట్లు నిర్ధారించారు. ముఖ్యంగా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లకు డెల్టా వేరియంట్‌ కారణమవుతున్నట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అయినా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరికలు, మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఇదే విషయంపై అమెరికాలో వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కూడా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: వుహాన్ ల్యాబ్​పై డబ్ల్యూహెచ్ఓ నిపుణుడి అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.