ETV Bharat / international

'వైరస్​ వ్యాప్తికి మానవ తప్పిదమే ప్రధాన కారణం' - కరోనా ఉత్పరివర్తనంపై మైఖేల్​ ర్యాన్​ వ్యాఖ్యలు

ప్రపంచ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్​ వ్యాప్తికి మానవులే బాటలు పరుస్తున్నారని డబ్ల్యూహెచ్​ఓ అభిప్రాయపడింది. అందరూ కొవిడ్​ నిబంధనలు పాటించి ఈ మహమ్మారిని కట్టడి చేయాలని పిలుపునిచ్చింది.

WHO cites human behavior
వైరస్​ వ్యాప్తికి మనుషుల తప్పిదమే అధికం: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Jan 16, 2021, 12:15 PM IST

కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​ దేశాల్లో కరోనా కొత్త రకం వైరస్​ ఉద్ధృతికి మానవుల ప్రవర్తనే కారణమని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్​ ప్రోగ్రామ్​ అధ్యక్షుడు​ మైఖేల్​ ర్యాన్​ అభిప్రాయపడ్డారు.

"వైరస్​ను నిందించడం చాలా సులభం. కానీ, దురదృష్టవశాత్తు మనమే చేయకూడనిది చేసేస్తున్నాం. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్​ నిబంధనలను పాటిస్తేనే వైరస్​ను అదుపులో పెట్టగలుగుతాం."

--- మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్​ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధ్యక్షుడు

అంతర్జాతీయ ప్రయాణాలపై డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జెన్సీస్​ కమిటీ శుక్రవారం నూతన సూచనలు జారీ చేసింది. ప్రయాణికులు వ్యాక్సినేషన్​కు సంబంధించి ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది. అన్నిదేశాలు సమన్వయంతో, తగు జాగ్రత్తలతో అంతర్జాతీయ ప్రయాణాలు సాగించాలని సూచించింది.

మరోవైపు.. బ్రెజిల్‌లోని కొత్త రకం కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు, టీకా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు బ్రిటన్​ ప్రభుత్వం.. దక్షిణ అమెరికా, పోర్చుగల్ రాకపోకలను నిషేధించింది.

ఇదీ చూడండి:కరోనా పంజా: కొత్తగా 7 లక్షల 35వేల కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.