అమెరికా విదేశాగమంత్రి మైక్ పాంపియో, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను చైనాకు అమ్ముడుపోయానన్న పాంపియో ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టెడ్రోస్. ఆ ఆరోపణలు అసత్యం, ఆమోదయోగ్యం కానివని వెల్లడించారు. పాంపియో వాదనకు ఆధారాలు లెవన్నారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్.
కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా శ్రమిస్తోందని టెడ్రోస్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు చేయకూడదని సూచించారు.
ఇదీ చూడండి:- 'కరోనా విముక్త ప్రపంచం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు'
కరోనా వైరస్ నేపథ్యంలో గతకొంత కాలంగా డబ్ల్యూహెచ్ఓపై అమెరికా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో ఆరోగ్య సంస్థ విఫలమైందని, వైరస్ పుట్టినిల్లు చైనాతో కలిసిపోయిందని ఆరోపించింది అగ్రరాజ్యం. గత వారం బ్రిటన్లో పర్యటించిన మైక్ పాంపియో.. టెడ్రోస్ చైనాకు అమ్ముడుపోయినట్టు తన వద్ద నిఘా సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ లండన్ పత్రిక కథనం ప్రచురించింది.
ఇవీ చూడండి:-