ETV Bharat / international

సెనేట్​లో '50-50'తో బైడెన్​కు సవాళ్లే! - BIPARTISANSHIP senate

సెనేట్​లో మెజారిటీ సమానంగా విడిపోవడం వల్ల కాంగ్రెస్​పై పూర్తి ఆధిపత్యానికి అడుగు దూరంలో నిలిచిపోయారు డెమొక్రాట్లు. కేబినెట్​కు ఎంపిక చేసిన సభ్యులను ఆమోదింపజేయడానికి ఈ మెజారిటీ బైడెన్​కు సరిపోయినా.. కీలకమైన చట్టాల విషయంలో అవరోధాలు ఎదుర్కోక తప్పదు. బైడెన్ రచించిన చాలా వరకు ప్రణాళికలను అడ్డుకునేందుకే రిపబ్లికన్లు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో 50-50 మెజారిటీతో బైడెన్​కు లాభమెంత? నష్టమెంత? ఓసారి పరిశీలిస్తే..

what-biden-can-and-cant-get-from-an-evenly-divided
సెనేట్​ మెజారిటీ బైడెన్​కు లాభమా నష్టమా?
author img

By

Published : Jan 21, 2021, 11:40 AM IST

అమెరికా ఎగువసభలో ఆధిక్యం సమాంతరంగా విడిపోవడం ఆసక్తికరంగా మారింది. జార్జియాలో ఇద్దరు డెమొక్రటిక్ అభ్యర్థుల గెలుపుతో సెనేట్​లో ఇరుపార్టీల బలం 50-50కి చేరింది. సభాధ్యక్ష హోదాలో కమలా హారిస్​ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి.. మెజారిటీ డెమొక్రాట్ల వైపే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ సాధారణ మెజారిటీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు తన ప్రణాళికలను పార్లమెంట్ గడప దాటించగలుగుతారా? మూడొంతుల మెజారిటీ అవసరమయ్యే బిల్లుల కోసం రిపబ్లికన్ల నుంచి ఎంతవరకు మద్దతు కూడగడతారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.

కలిసొచ్చేవి ఇవే!

1. నామినేషన్లు

సెనేట్ అధ్యక్ష కుర్చీపై డెమొక్రటిక్ నేత కమలా హారిస్ ఉన్నందున అధ్యక్షుడు తన మంత్రివర్గానికి ఎంపిక చేసిన నామినేషన్లు సులువుగానే పార్లమెంట్ గడప దాటనున్నాయి. సుప్రీంకోర్టు సహా ఇతర కోర్టులకు న్యాయమూర్తుల ఎంపిక సైతం సులభంగానే సాగనుంది. ఈ ప్రక్రియను రిపబ్లికన్లు ఆలస్యం చేసే అవకాశం ఉంది. కానీ అడ్డుకోవడం మాత్రం అసాధ్యం.

2. బడ్జెట్​కు గ్రీన్ సిగ్నల్!

బడ్జెట్​కు సంబంధించిన ప్రత్యేక బిల్లులు సాధారణ మెజారిటీతోనే సెనేట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. బడ్జెట్​ బిల్లులో మార్పులు సైతం చేసే వీలు ఉంటుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన పన్ను మినహాయింపులను వెనక్కి తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ వైద్య సంరక్షణ చర్యలను మరింత సులభతరం చేయడానికి బైడెన్​కు అవకాశం దక్కింది.

3. అజెండా కోసం

కమలా హారిస్ స్థానంలో వచ్చిన అలెక్స్ పాడిలాతో కలిసి మొత్తం ముగ్గురు సభ్యులు సెనేట్​లో అడుగుపెట్టినందున.. సభలో మెజారిటీ లీడర్​ హోదా డెమొక్రటిక్ నేత చక్ షూమర్​ను వరించింది. బిల్లులను సభలో ప్రవేశపెట్టి, ఓట్లు కోరే అవకాశం ఆయనకు లభించింది. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలపై చర్చకు పిలుపునిచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ బిల్లులకు మాత్రం రిపబ్లికన్ల మద్దతు అనివార్యం అవుతుంది.

అమెరికాలోని కుటుంబాలకు రెండు వేల డాలర్లను అందించే కరోనా ఉద్దీపన ప్యాకేజీ సెనేట్ ఆమోదం పొందే అవకాశం ఉంది.

బైడెన్​కు ఎదురయ్యే సవాళ్లు

1. జాప్యాన్ని నివారించడం

సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి, ఆలస్యం చేయడానికి సెనేట్​లో విపక్ష సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. బిల్లులపై దీర్ఘకాలం పాటు చర్చలు జరపడం, అనేక ప్రశ్నలు లేవనెత్తడం(దీన్నే ఫిలిబస్టర్​గా వ్యవహరిస్తారు) వంటివి చేస్తారు. ఇలాంటి వాటిని నివారించాలని డెమొక్రటిక్ పార్టీలోని కొందరు సభ్యులు గతంలో ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో, డెమొక్రటిక్ సభ్యుడు జో మన్​చిన్ మాత్రం ఫిలిబస్టర్​ను రూపుమాపే ప్రయత్నాలను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పలు బిల్లుల విషయంలో సెనేట్ సమయం వృథా కాకుండా అడ్డుకోవడం బైడెన్ సర్కారుకు కష్టతరం కానుంది.

2. ఆధిక్యం నిలుపుకోవడం

సభల్లో పూర్తి పట్టు లేకపోయినా అధ్యక్షుడి అధికారాలను తిరగరాయవచ్చని.. ఇటీవలి సంఘటనలు సూచిస్తున్నాయి. 900 బిలియన్ డాలర్ల కొవిడ్ ప్యాకేజీపై ట్రంప్ వీటోను కాంగ్రెస్ తిరస్కరించడం ఇందుకు ఉదాహరణ. అయితే, రుణ పరిమితిని పెంచడంపై సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

2022లో ఉభయ సభల్లోని(ప్రతినిధుల సభలో 435, సెనేట్​లో 34) స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఫలితాలు సభలో ఆధిక్యాన్ని నిర్ణయిస్తాయి. ఇందులో డెమొక్రాట్లు సత్తా చాటకపోతే.. సెనేట్ మెజారిటీ మూణ్నాళ్ల ముచ్చటే అవుతుంది.

3. సభ్యుల్లో అభిప్రాయ భేదాలు

సభలో మెజారిటీ 50-50గా ఉండటం వల్ల ఏ ఒక్క డెమొక్రటిక్ సభ్యుడైనా కార్యకలాపాలను ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. 'మెడికేర్ ఫర్ ఆల్', గ్రీన్ న్యూ డీల్ వంటి బిల్లులను షూమర్​తో పాటు, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇవి సభ ఆమోదం పొందడం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఇది పార్టీలోని ఉదారవాదులకు కంటగింపుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మౌలిక సదుపాయాలకు నిధులు పెంపొందించడం సహా, బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని వారి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

'నవ్య అమెరికాను నిర్మిద్దాం.. నాతో రండి'

'భారత్‌ మన దోస్త్.. చైనాను నమ్మలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.