ETV Bharat / international

మీటూ: ఆ నిర్మాతకు 23 ఏళ్లు జైలు శిక్ష

author img

By

Published : Mar 11, 2020, 11:42 PM IST

లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో దోషిగా తేలిన హాలీవుడ్​ నిర్మాత హార్వే వైన్​స్టీన్​కు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యూయార్క్​ కోర్టు. వైన్​స్టీన్​పై సుమారు 80 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అందులో నటి హలేయీతో పాటు మరో నటి జెస్సికా ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి దోషిగా తేల్చింది న్యూయార్క్​ కోర్టు.

Weinstein
ఆ నిర్మాతకు 23 ఏళ్ల జైలు శిక్ష

హాలీవుడ్​ నిర్మాత హార్వే వైన్​స్టీన్​కు 23 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది న్యూయార్క్​ కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వైన్​స్టీన్​కు బుధవారం శిక్ష ఖరారు చేసింది.

వైన్​స్టీన్​ పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013లో న్యూయార్క్​ నగరంలోని ఓ హోటల్​లో.. ఓ నటిపై అత్యాచారం, 2006లో మిమి హలేయీపై లైంగిక దాడుల కేసుల్లో గత నెల దోషిగా తేల్చింది కోర్టు.

ప్రస్తుతం విధించిన శిక్షతో పాటు గరిష్ఠంగా 29 ఏళ్లపాటు జైలులో గడపనున్నాడు వైన్​స్టీన్​.

బుధవారం కోర్టులో విచారణ సందర్భంగా తమకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు బాధిత మహిళలు. ఈ సందర్భంగా తాను ఈ పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్లు కోర్టుకు తెలిపాడు వైన్​స్టీన్​. తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. కేసుతో కలత చెందినట్లు పేర్కొన్నాడు. కానీ జైలు శిక్ష విధించటంపై స్పందించేందుకు నిరాకరించాడు.

2017లో వెలుగులోకి...

వైన్​స్టీన్​పై​ 90 మందికిపైగా మహిళలు 'మీటూ' ఆరోపణలు చేశారు. అందులో కథానాయికలు గ్వైనెత్​ పాల్ట్రో, సల్మా హయెక్​, ఉమా థుర్మెన్​, జెస్సికాలు ఉన్నారు. హయెకా, జెస్సీకా నిర్మాతపై ఫిర్యాదు చేశారు. వైన్​స్టీన్​పై 2017లో న్యూయార్క్​ టైమ్స్​, ది న్యూయార్కెర్​ వార్తా పత్రికల వేదికగా మీటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

వైన్​స్టీన్​ అకృత్యాలు బయటపడిన నేపథ్యంలో మీటూ ఉద్యమానికి పునాది పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవితంలో ఎదురైన లైంగిక దాడుల గురించి బహిర్గతం చేశారు.

ఇదీ చూడండి: 'పిల్లల బెడ్​రూంలోకి లాక్కెళ్లి, బలవంతంగా ముద్దాడి...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.