ETV Bharat / international

వందేళ్ల క్రితం ఫ్లూతో ఒకరు.. ఇప్పుడు కరోనాతో మరొకరు

అమెరికాలోని ఇద్దరు కవలలు... వైరస్ మహమ్మారులకే బలయ్యారు. అయితే వందేళ్ల క్రితం స్పానిష్​ ఫ్లూ సోకి ఆ కవలల్లో ఒకరు మృతి చెందగా, తాజాగా కరోనాతో మరొకరు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి.. వందేళ్ల వయసులో ఇప్పుడు కరోనాతో పోరాడి మరణించాడు.

Virus kills WWII veteran 100 years after twin died of Spanish flu
వందేళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు మరొకరు
author img

By

Published : Apr 24, 2020, 6:45 AM IST

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికా మాజీ సైనికుడు ఫిలిప్ కాన్​.. కరోనా మహమ్మారి సోకి మరణించాడు. ఐవో జిమా యుద్ధం, హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన తర్వాత ఏరియల్ సర్వేలకు ఈయన సహకారం అందించాడు.

అయితే.. 1918-19 మధ్య కాలంలో విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో అతని కవల సోదరుడు శామ్యూల్​ మరణించాడు. యాదృచ్ఛికమే అయినా వందేళ్ల వ్యవధిలో కవలలు రెండు వేర్వేరు మహమ్మారులతో ప్రాణాలు కోల్పోయారు.

ఫిలిప్​​, శామ్యూల్​ 1919 డిసెంబర్​లో జన్మించారు. అప్పటికే విజృంభించిన స్పానిష్​ ఫ్లూతో వారిలో ఒకరైన శామ్యూల్​ మరణించాడు. అయితే ఫిలిప్​ తన జీవిత కాలంలో ఇలాంటి వైరస్​ వస్తుందని భయపడినట్లు అతని మనవుడు వారెన్ జిస్మాన్ తెలిపాడు.

" నేను తాతగారితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని చెప్పారు. వారు పుట్టిన ఏడాది వ్యాప్తి చెందిన వైరస్​ మళ్లీ వందేళ్లకు వస్తుందన్నారు. ఈనెల 17న తాతగారు మరణించేందుకు ముందు దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా తాతగారు వారి సోదరుడి గురించి ప్రస్తావించారు."

-- వారెన్ జిస్మాన్, ఫిలిప్​​ మనవడు

ఫిలిప్​ 1940లో అమెరికా సైన్యంలో పైలట్​గా శిక్షణలో చేరారు. అమెరికా సైన్యంలో ఆయన సేవలకు గాను రెండు కాంస్య స్టార్​లు లభించాయి. 2017లో తన 98వ పుట్టినరోజు సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన యుద్ధం చాలా భయంకరమైనదని గుర్తుచేసుకున్నారు. యుద్ధం వల్ల ఎంతో మంది సైనికులు మృతిచెందగా, చాలా మంది పౌరులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

వందేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన స్పానిష్​ ఫ్లూ వల్ల 5 కోట్ల మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఇదీ చదవండి: కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.