ETV Bharat / international

'కరోనాపై పోరులో భారత్​కు అండగా ఉంటాం' - కరోనా పోరులో భారత్​కు అమెరికా సాయం

భారత్​లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. ఈ క్రమంలో కొవిడ్​​ పోరులో భారత్​కు సహాయం చేస్తామని పేర్కొంది. వైరస్​ నియంత్రణకు అన్నివిధాలా భారత్​ ప్రజలకు అండగా నిలుస్తామని వెల్లడించింది.

US Secretary of State Antony Blinken
ఆంటోనీ బ్లింకెన్
author img

By

Published : Apr 25, 2021, 10:49 AM IST

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. భారత్​కు అండగా నిలుస్తామని అమెరికా తెలిపింది. భారత్​లో కొవిడ్​ ఉద్ధృతికి చలించిపోయామన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​.. వైద్య అవసరాలకు మద్దతు ఇస్తామని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

"భారత్​లో​ కరోనా ఉద్ధృతిని చూసి మా హృదయాలు చలించిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్​ ప్రజలకు, కరోనా యోధులకు అండగా ఉంటాం. ఇందుకు కావాల్సిన వైద్య అవసరాలకు మద్దతు ఇస్తాం."

- ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి

ఆ దేశ జాతీయ భద్రత సలహాదారు జాక్..​ భారత్​లో కరోనా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "మిత్ర దేశమైన భారత్​కు సహాయం చేయడానికి అగ్రరాజ్యం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి భారత్​ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" అని ఆయన ట్వీట్​ చేశారు.

భారత్​కు మరింత సాయం చేసేందుకు, వైద్య పరికరాలు, టీకాలు సరఫరా చేయాలని అమెరికాలోని పలువురు చట్టసభ్యులు బైడెన్​ సర్కార్​పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: భారత్‌కు సాయం ప్రకటించిన పాక్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.