ETV Bharat / international

భారత్​-చైనా 'సయోధ్య'పై అమెరికా హర్షం

author img

By

Published : Feb 12, 2021, 11:42 AM IST

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేస్తోన్న ప్రయత్నాలను అమెరికా స్వాగతించింది. బలగాల ఉపసంహరణను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

US welcomes efforts by India and China
బలగాల ఉపసంహరణను స్వాగతించిన అమెరికా

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత-చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా స్వాగతించింది. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు చేస్తున్న కృషిని.. బలగాల ఉపసంహరణను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ రాజ్యసభలో ప్రకటించిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని తెలిపింది.

బలగాల ఉపసంహరణను రిపబ్లికన్ సభ్యుడు మైఖేల్ మక్కాల్ కూడా స్వాగతించారు. భారత్​ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి బలంగా నిలబడటం హర్షణీయమని ఆయన ట్వీట్​ చేశారు. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ తూర్పు, దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు నిరంతర చేస్తోన్న విస్తరణవాదానికి 21వ శతాబ్దంలో చోటు లేదన్నారు.

గత ఏడాది జూన్​ 15న గాల్వన్​ లోయలో భారత్​-చైనా బలగాల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలక ఫింగర్​ ప్రాంతాల్లో ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. పలు దఫాలుగా సైనిక, దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. ఇటీవలి చర్చల్లో బలగాల ఉపసంహరణకు ఏకాభిప్రాయం కుదిరినట్లు రక్షణ మంత్రి ప్రకటించారు. బలగాలను చైనా వెనక్కి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'యథాతథ స్థితి నెలకొల్పడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.