ETV Bharat / international

'చైనా దుర్బుద్ధిని తీవ్రంగా పరిగణించాలి'

చైనాపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. భూటాన్​లో ప్రాదేశిక వాదనలు, ఇటీవల భారత్​లోకి చొరబాట్లు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. తమ అధికారాన్ని విస్తరించుకోవాలనే కోరికతో దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రపంచం చైనా దుర్బుద్ధిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు.

Pompeo
'భారత్​లోకి చొరబాటు చైనా ఉద్దేశాలను సూచిస్తోంది'
author img

By

Published : Jul 31, 2020, 5:39 AM IST

Updated : Jul 31, 2020, 5:59 AM IST

చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. భూటాన్​లోని భూభాగం తమదేనని పేర్కొనటం, ఇటీవల భారత భూభాగంలోకి చొరబాటు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నేతృత్వంలోని చైనా.. ఇతర దేశాలు అభివృద్ధిలో వెనకబాటుకు గురవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో భాగంగా చైనాపై విమర్శలు చేశారు పాంపియో.

" ఈ చర్యలు వారు దశాబ్దాలుగా ప్రపంచానికి సంకేతాలు ఇస్తున్న వాటికి అనుగుణంగా ఉన్నాయని నేను భావిస్తున్నా. చైనా తన అధికారాన్ని విస్తరించుకోవాలనే కోరికతో ఉంది. చైనీయుల లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా సామాజికతను తీసుకువచ్చేందుకు మాట్లాడుతోంది. భూటాన్​లో స్థిరాస్తి వాదనలు, భారత్​లోకి జరిగిన చొరబాటు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయి. ఇవి వారి బెదిరింపులకు ప్రపంచం నిలబడుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు పరిశీలనలు."

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి.

చైనా బెదిరింపులు, దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు ప్రపంచ సిద్ధమైదని ఏడాది క్రితమే నమ్మినట్లు చెప్పారు పాంపియో. ఈ అంశాన్ని ప్రపంచం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. పౌరుల గోప్యత, భద్రతకు భంగం కలుగుతుందనే అంశంలో భారత్​ 106 చైనా యాప్​లను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'కమ్యూనిస్ట్​ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పు వాస్తవం'

Last Updated : Jul 31, 2020, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.