ETV Bharat / international

నవంబరు 8 నుంచి విదేశీయులకు అనుమతి.. కానీ..

కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించింది అమెరికా. నవంబర్​ 8 నుంచి రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.

vaccinated foreign travellers
వ్యాక్సిన్​ వేయించుకున్న వారు మాత్రమే
author img

By

Published : Oct 16, 2021, 4:20 AM IST

నవంబర్​ 8 నుంచి వ్యాక్సినేషన్​ పూర్తి చేసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించనున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. దీంతో భారత్, యూకే, చైనా వంటి దేశాలపై ప్రస్తుతం అమలవుతున్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ కొత్త విధానం అంతర్జాతీయ విమాన, రోడ్డు ప్రయాణాలు.. రెండింటికీ వర్తిస్తుంది. అమెరికా లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదించిన టీకాను తీసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అమెరికా అనుమతిస్తోంది. కొత్త విధానంపై సెంటర్​ ఫర్​ డిసీజ్ కంట్రోల్​ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

అమెరికాలో 4,47,83,838 మంది కరోనా బారిన పడగా, 7,21,848 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.