అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. నెబ్రస్కా రాష్ట్రం ఒమాహా నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పుల మోతతో షాపింగ్ మాల్లో ఉన్నవారు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఒమాహా నగరంలో ఈ నెలలో కాల్పులు జరిగడం ఇది రెండోసారి.
రసాయన ద్రావణం పోసి.. నిప్పంటించి..
అగ్రరాజ్యంలో దుండగుల దశ్చర్యలకు అంతే లేకుండా పోతోంది. న్యూయార్క్ నగరంలో ఓ కారు డ్రైవర్ ఏకంగా పోలీసుపైనే రసాయనిక ద్రావణాన్ని పోసి, నిప్పంటించాడు. అనంతరం పోలీసు అధికారిని నెట్టేసి వాహనంతో సహా పారిపోవడానికి ప్రయత్నించాడు.
నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కారులో హానికర రసాయన ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. స్వల్ప గాయాలపాలైన పోలీసును ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'నావల్నీ ఏ క్షణంలోనైనా మరణించవచ్చు'
ఇదీ చదవండి: కమలా హారిస్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు