ETV Bharat / international

అమెరికా-రష్యా అగ్రనేతల మాటల యుద్ధం! - జో బైడెన్​

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ విభాగం ఆరోపించిన నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్​ను కిల్లర్​గా పేర్కొన్నారు బైడెన్​. ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు పుతిన్​. ఈ వివాదం.. ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Biden putin
అమెరికా-రష్యా సంబంధాలపై 'అగ్రనేతల' మాటల చిచ్చు!
author img

By

Published : Mar 19, 2021, 10:12 AM IST

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం అంశంపై అమెరికా-రష్యా అధినేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిణామం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇప్పటికే అంతంతమాత్రంగానే ఉన్న సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను అణచివేసే ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తగిన మూల్యం చెల్లించక తప్పదని, అతనో కిల్లర్​ అని నమ్ముతున్నట్లు బైడెన్​ ఘాటుగా స్పందించారు. బైడెన్​ వ్యాఖ్యలపై అదే స్ఠాయిలో స్పందించారు పుతిన్​. బైడెన్​ మాటలు అమెరికా వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

పుతిన్​పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చూపిన సానుకూల ధోరణికి దూరంగా ఉండాలని మొదటి నుంచి భావిస్తున్నారు బైడెన్​​. అయినప్పటికీ.. రష్యాతో కీలక ఆయుధాల నియంత్రణ బిల్లుకు అంగీకరించారు. దీని ద్వారా.. మాస్కో పట్ల కాస్త సానుకూలంగానే ఉన్నట్లు కనిపించినా.. కఠిన వైఖరిని తెలియజేస్తూ.. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్​పై అమెరికా ఆధారపడే రోజులు ముగిశాయని వ్యాఖ్యానించారు. ట్రంప్​ వైఖరితో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

శ్వేత సౌధం కీలక ప్రకటన

ఇరు దేశాల అగ్రనేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో శ్వేతసౌధం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉభయ దేశాలకు కీలకమైన రంగాల్లో పుతిన్​తో కలిసి పనిచేసేందుకు బైడెన్​ సుముఖంగా ఉన్నారని ప్రకటించింది. కానీ, పుతిన్​ తీసుకునే అమెరికా వ్యతిరేక చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.

"ఇరాన్​ అణు కార్యక్రమాన్ని నిరోధించే ప్రయత్నాలకు బైడెన్​ సహకరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ.. పుతిన్​ను కిల్లర్​గా పేర్కొనటంపై బైడెన్​ చింతించటం లేదు. వాక్చాతుర్యం అన్ని వేళలా సాయపడదు. పుతిన్​కు అధ్యక్షుడు బైడెన్​ చాలా కాలంగా తెలుసు. ప్రపంచ వేదికలపై సుదీర్ఘకాలం కలిసి పనిచేశారు. దానిని కొనసాగించటాన్నే బైడన్ నమ్ముతున్నారు. "

- జెన్​ సాకి, శ్వేతసౌధం ప్రెస్​ సెక్రెటరీ.

రష్యా వాదన..

అమెరికా పౌరుల్లో చాలామంది రష్యాతో శాంతి, స్నేహాన్ని కోరుకుంటారని.. అదెంతో విలువైన విషయమని పుతిన్​ తెలిపారు. బైడెన్​ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా.. అమెరికాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు..బైడెన్​ వ్యాఖ్యలు దురదృష్టకరమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆయన ఇష్టపడట్లేదని విమర్శించారు.

ఇవీ చూడండి: పుతిన్‌ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్‌

'బైడెన్​ వ్యాఖ్యలు అమెరికా గత చరిత్రకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.