పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరనుంది! తాను పగ్గాలు చేపట్టిన తొలిరోజే ఈ ఒడంబడికలోకి అగ్రరాజ్య పునరాగమనం ఉంటుందని అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ శనివారం ప్రకటించారు.
తాము బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో ముఖ్య ఆర్థిక సమాజాల నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు బైడెన్. భూతాపాన్ని తగ్గించేందుకు 2015లో పారిస్ వేదికగా చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు 2017లో అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాలుష్యానికి భారత్, చైనాలు ప్రధాన కారణమవుతున్నాయనీ... ఈ ఒప్పందంతో తాము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. 2025 నాటికి 25లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ!