ఉత్తరకొరియాకు ప్రత్యేక రాయబారిని నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
"దౌత్యవేత్త, దేశాల మధ్య లోతైన విధానాల అనుభవజ్ఞుడు సంగ్ కిమ్‌ను ఉత్తరకొరియాకు ప్రత్యేక రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన డీపీఆర్కే(డిప్లొమాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా- ఉత్తరకొరియా)కు రాయబారిగా వ్యవహరిస్తారు.
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
డీపీఆర్కే(ఉత్తరకొరియా) అధికార యంత్రాంగాన్ని సమీక్షించేందుకు తన బృందం.. మూన్ బృందాన్ని సంప్రదించిందని జో బైడెన్ తెలిపారు. తాజా పరిస్థితులపై తామిద్దరం లోతుగా చర్చించామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేలా.. అణ్వాయుధాలను నిర్వీర్యం చేసేందుకు ఉపకరించేలా... ఉత్తరకొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను తాము కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొరియా ప్రాంతంలో పూర్తి అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడం.. శాంతిని నెలకొల్పడమే.. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి లక్ష్యమని మూన్ జే ఇన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా