ETV Bharat / international

'ఇండో పసిఫిక్'లో చైనాకు చెక్​ పెట్టేలా అమెరికా, జపాన్​ చర్చలు - ఇండో పసిఫిక్​ ప్రాతం

ఇండో పసిఫిక్​ ప్రాతంలో చైనా ఆగడాలకు చెక్​ పెట్టే దిశగా.. కలిసి ముందుకు సాగాలని అమెరికా, జపాన్​ అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జపాన్​ ప్రధాని యొషిహిదే సుగా శుక్రవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. బైడెన్​ తొలిసారి ఓ విదేశీ నేతతో ప్రత్యక్షంగా సమావేశం కావటం వల్ల ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

biden, suga
అమెరికా, జపాన్​
author img

By

Published : Apr 17, 2021, 4:57 PM IST

Updated : Apr 17, 2021, 5:38 PM IST

జపాన్​ ప్రధాన మంత్రి యొషిహిదే సుగాతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా ఆగడాలు, క్వాడ్​ దేశాల సమైక్యతపై ఇరువురు నేతలు చర్చించారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారిపై పోరు, ఉత్తరకొరియా అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఓ విదేశీ ప్రధానితో బైడెన్​ ప్రత్యక్షంగా సమావేశమవ్వటం ఇదే తొలిసారి.

"ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి పునాది వేయటంలో మా కూటమి తన వంతు పాత్రను పోషించింది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి, భద్రతా వాతావరణం దృష్ట్యా మా కూటమి ప్రాముఖ్యత కొత్త శిఖరాలకు చేరింది. ఇదే ధోరణిలో ముందుకు సాగేందుకు మేం అంగీకారానికి వచ్చాం. ఆసియాన్​, ఆస్ట్రేలియా, భారత్​ సహా ఇతర దేశాలకూ మా సహాకారాన్ని అందిస్తాం. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా ప్రభావంపై మేం చర్చించాం. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చేసే యత్నాలను కలిసి అడ్డుకునేందుకు అంగీకారానికి వచ్చాం.''

-యొషిహిదే సుగా, జపాన్​ ప్రధాన మంత్రి.

తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు తాము జపాన్​తో కలిసి పని చేస్తామని బైడెన్ తెలిపారు.

"జపాన్​, అమెరికా రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు. మానవహక్కులు, చట్టాల నియమాలు, భాగస్వామ్య విలువలను రక్షించడానికి, ముందుకు సాగడానికి మేం కట్టుబడి ఉన్నాం. 21వ శతాబ్దంలోనూ ప్రజాస్వామ్య దేశాలు పోటీ పడి, విజయం సాధించగలవని నిరూపించేందుకు మేం కలిసి పని చేయబోతున్నాం. మాకు ఎదురయ్యే సవాళ్లను మేం కలిసి ఎదుర్కొంటాం. కరోనా మహమ్మారిని కట్టడిలో, వ్యాక్సినేషన్​లో సహకారాన్ని అందించుకుంటాం."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయంగా జపాన్​తో ఈ చర్చలు జరిపేందుకు అవకాశం లేదని జో బైడెన్​ పేర్కొన్నారు. జపాన్​ ప్రధానితో వ్యక్తిగతంగా అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం లభించడాన్ని గొప్పగా భావిస్తున్నానని తెలిపారు.

ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం అమెరికా, జపాన్​ కలిసి పని చేస్తాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ తెలిపారు. జపాన్​ ప్రధానితో చక్కని సంభాషణ జరిగిందని చెప్పారు.

కాగా.. అంతకుముందు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జీ7 సదస్సులో, క్వాడ్​ సదస్సులో బైడెన్, సుగా సమావేశమయ్యారు.

చైనా ఆగ్రహం..

స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్​ ప్రాంతం ఏర్పాటుకు అమెరికా, జపాన్​ పిలుపునిచ్చిన నేపథ్యంలో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ​చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన అనేది తమ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. శాంతికి విఘాతం కలిగించేలా అమెరికా, జపాన్​ సంయుక్త ప్రకటన ఉందని ఆరోపించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:రౌల్​ క్యాస్ట్రో రాజీనామా- క్యూబాలో ముగిసిన సుదీర్ఘ శకం

ఇదీ చూడండి:అమెరికా కాల్పుల మృతుల్లో నలుగురు భారతీయులు

Last Updated : Apr 17, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.