ETV Bharat / international

మాజీ భద్రతా సలహాదారును క్షమించిన ట్రంప్​ - మాజీ భద్రతా సలహాదారుకు ట్రంప్​ క్షమాభిక్ష

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన మాజీ భద్రతా సలహాదారు మైఖేల్​ ఫ్లిన్​ను క్షమించారు. క్షమాపణ ఉత్తర్వులపై సంతకాలు చేసిన ట్రంప్.. ఫ్లిన్​, అతని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.

US President Donald Trump pardons former NSA Michael Flynn
తన​ మాజీ భద్రతా సలహాదారును క్షమించిన ట్రంప్​
author img

By

Published : Nov 26, 2020, 1:54 PM IST

Updated : Nov 26, 2020, 2:30 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన మాజీ భద్రతా సలహాదారు(ఎన్​ఎస్​ఏ) మైఖేల్​ ఫ్లిన్​కు క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్​. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్​ ప్రచారం, రష్యాతో కుదిరిన ఒప్పందంపై ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​(ఎఫ్​బీఐ)కు అసత్య నివేదికలు ఇచ్చినట్టు ఫ్లిన్​పై అభియోగాలు ఉన్నాయి.

మైఖైల్​ టీ. ఫ్లిన్​కు క్షమాపణ చెప్పడంపై గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేశారు ట్రంప్​.

US President Donald Trump pardons former NSA Michael Flynn
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​

"జనరల్ మైఖేల్ టి. ఫ్లిన్​కు క్షమాపణ మంజూరైనట్టు ప్రకటించడం గొప్ప గౌరవంగా ఉంది. ఫ్లిన్, అతని కుటుంబ సభ్యులకు అభినందనలు. మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పాలని ఉంటుదని నాకు తెలుసు."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

ఫ్లిన్​ను ఇకపై ఎప్పటికీ విచారించకూడదనే ఉద్దేశంతోనే ట్రంప్ క్షమించారని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రెటరీ కైలీ మెక్​నానీ అన్నారు.

ఇదీ చదవండి: 'ఉగ్రవాదంపై భారత్​తో కలిసి పోరాటం'

Last Updated : Nov 26, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.