అమెరికాలో 2019-20 ఏడాదిలో అతి తక్కువ జనాభా పెరుగుదల నమోదైనట్లు తెలిపింది అక్కడి జనన గణన సంస్థ. 120 ఏళ్లలో ఇంత స్వల్ప వృద్ధి నమోదవడం ఇదే తొలిసారని వెల్లడించింది. వలస విధానంలో ఆంక్షలు, జననాలు తగ్గడం వల్లే కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కరోనా మరణాలు జనాభా వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయని 'ద బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్'కు చెందిన మెట్రోపాలిటన్ పాలసీ ప్రోగ్రామ్ సీనియర్ పరిశోధకులు విలియం ఫ్రే అన్నారు.
జనన గణన సంస్థ అంచనాల ప్రకారం.. 2019 జులై నుంచి 2020 జులై వరకు యూఎస్ జనాభా 0.35 శాతం పెరిగింది. గతేడాది జులైలో 329 మిలియన్ల మంది ఉన్న అగ్రరాజ్యంలో.. ఈ సంవత్సరం జులై నాటికి 10.1 లక్షల మంది పెరిగారు. చివరిసారిగా స్పానిష్ ఫ్లూ విజృంభణ(1918-1919) సమయంలో అతి తక్కువగా 0.49 శాతం పెరుగుదల నమోదైంది.
ఇవీ చదవండి: