సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. అఫ్గానిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలిగాయి అమెరికా బలగాలు(Afghan US Troops). ఆగస్టు 31న ఇది పూర్తయింది. దాదాపు లక్ష మందికిపైగా ప్రజల్ని.. అఫ్గాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా మంది ఆ దేశంలోనే ఉన్నారు. బలగాల ఉపసంహరణ (Afghanistan US Troops) హడావుడిలో అమాయకులైన అఫ్గాన్ పౌరులతో పాటు.. అమెరికాకు చెందిన కొన్ని కుటుంబాల తరలింపు సాధ్యం కాలేదు.
మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అఫ్గానిస్థాన్‌లో ఇన్నేళ్లు సేవలందించిన అమెరికా శునకాలను(Service Dogs Afghanistan) కూడా బలగాలు అక్కడే వదిలేసి వచ్చాయంట. ఆ సర్వీస్ డాగ్స్ ఆకలితో అలమటిస్తున్నాయి.
అమెరికా సైనికులు తొందరపాటులో తిరిగొచ్చారని చెబుతున్నప్పటికీ.. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ జాగిలాల్ని.. వెటరన్ షీప్‌డాగ్స్ ఆఫ్ అమెరికా అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అమెరికాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కాబుల్‌లో వాటి బాగోగుల్ని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భారత్ మాత్రం.. అఫ్గాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన ఐటీబీపీకి చెందిన మాయ, బాబీ, రూబీ కే-9 జాగిలాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ రెండింటినీ పోలుస్తూ.. అమెరికా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
-
Our K9 Heroes Are Home Too! ❤️@ITBP_official's dog squad stationed at Indian Embassy in Kabul - Maya, Bobby and Roobi - also flew back in Operation Airlift Kabul on August 16.
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) August 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The three braves had secured @IndianEmbKabul for past 3 years.#Afghanistan #Taliban #Kabul #India pic.twitter.com/wqDEfV4KOz
">Our K9 Heroes Are Home Too! ❤️@ITBP_official's dog squad stationed at Indian Embassy in Kabul - Maya, Bobby and Roobi - also flew back in Operation Airlift Kabul on August 16.
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) August 18, 2021
The three braves had secured @IndianEmbKabul for past 3 years.#Afghanistan #Taliban #Kabul #India pic.twitter.com/wqDEfV4KOzOur K9 Heroes Are Home Too! ❤️@ITBP_official's dog squad stationed at Indian Embassy in Kabul - Maya, Bobby and Roobi - also flew back in Operation Airlift Kabul on August 16.
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) August 18, 2021
The three braves had secured @IndianEmbKabul for past 3 years.#Afghanistan #Taliban #Kabul #India pic.twitter.com/wqDEfV4KOz
ఒప్పందానికి కట్టుబడి..
తాలిబన్లతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆగస్టు 31కల్లా అమెరికా బలగాలు పూర్తిగా అఫ్గాన్‌ను వీడాలి. దీనికి కట్టుబడి ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు అధ్యక్షుడు జో బైడెన్. ఇంకా దాదాపు 200 మంది అమెరికా పౌరులు, అఫ్గాన్‌ను వీడాలనుకున్న అక్కడి వేలాది పౌరులను మాత్రం నిర్దేశిత సమయంలోగా తరలించలేకపోయింది.
మిగిలినవారు కూడా.. రావాలనుకుంటే అందుకు తగ్గట్లు చర్యలు తీసుకుంటామన్నారు బైడెన్. 90 శాతం అమెరికన్ పౌరులను తరలించామని స్పష్టం చేశారు. అఫ్గాన్ నుంచి విదేశాలకు వెళ్లేవారిని తాలిబన్లు(Afghanistan Taliban) అడ్డుకోకుండా అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయం చేసుకోవాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు సూచించారు.
ఇదీ చూడండి: Afghanistan Biden: '20 ఏళ్లుగా యుద్ధం.. పొడిగించాలని లేదు'